జల్ఫీకర్‌ జ్ఞాపకార్థం ఆస్పత్రికి స్ట్రెచర్‌ అందజేత

చెన్నూర్, ఆంధ్రప్రభ: చెన్నూరు మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ క్రీస్తుశేషులు మహ్మద్‌ జుల్ఫీకర్‌ అహ్మద్‌ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు మహ్మద్‌ జలాల్‌ ఇబ్రహీం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి స్ట్రెచర్‌ అందజేశారు. జుల్ఫీకర్‌ అహ్మద్‌ జన్మదినం సందర్భంగా రోగుల సహాయార్థం ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. రోగులకు ఉపయోగపడేలా స్ట్రెచర్‌ అందించడం పట్ల ఆస్పత్రి సిబ్బంది, స్థానికులు అభినందించారు.