ఆలేరులో కేసీఆర్‌కు ఘన స్వాగతం
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు బైపాస్ మీదుగా నర్సంపేటకు వెళ్తూ ఆదివారం కొద్దిసేపు ఆగిన బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా కేసీఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అభివాదం చేశారు.
కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, వస్పరి శంకరయ్య, కర్రె వెంకటయ్యతో పాటు పట్టణ, మండల, గ్రామ పార్టీ బాధ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
