పెదకూరపాడులో పెట్రోల్ నిరసనలు

పెదకూరపాడులో పెట్రోల్ నిరసనలు
పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాల
పెదకూరపాడు మండల కేంద్రం లో నిరసన చేపట్టిన వై యస్ ఆర్ సీపీ శ్రేణులు.
అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు.
పెదకూరపాడు (పల్నాడు) ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమెండ్ చేస్తూ మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు ఆదేశాల మేరకు పెదకూరపాడు మండల కేంద్రంలో వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల సమయంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను మేము అధికారం లోకి వస్తే తగ్గిస్తాం అని చెప్పిన కూటమి ప్రభుత్వం నేడు అధికారం లోకి వచ్చిన తర్వాత ప్రజల నడ్డి విరిచే విధంగా నిత్యవసర సరుకులతో పాటు, దేశం లో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారన్నారు.
వెంటనే పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని కోరుతూ పెదకూరపాడు తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో పెదకూరపాడు నియోజకవర్గం లోని వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

