రేవంత్ రెడ్డి లక్ష్యం రైతంగం క్షేమంగా ఉండడం

రేవంత్ రెడ్డి లక్ష్యం రైతంగం క్షేమంగా ఉండడం
- రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి
భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : రాజకీయ లబ్ధికోసం మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే రోడ్డు ఎక్కుతున్నారని రాష్ట్ర సహకార సంఘాల చైర్మెన్ మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. రైతులు బీఆర్ఎస్ పార్టీ మాయలో పడొద్దని కోరారు. వేముల ప్రశాంత్ రెడ్డి సారద్యంలో మోర్తాడ్ లో జరిగినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల ధర్నాలో ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మిల్లర్ల దోపిడీ పెరిగిందని మాట్లాడుతున్నారని అన్నారు. ఈ విషయంలో వేముల ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఈ రెండున్నర సంవత్సర కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మిల్లర్ల దోపిడీ ఎలా ఉందో చర్చకు సిద్దామా అని సవాల్ విసిరారు.
రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి లాంటివారు కూడా రైతుల పక్షాన మాట్లాడడం లేదని అనడం పక్వత లేని మాటలుగా పేర్కొన్నారు .గత 15 రోజులుగా మా నాయకులు పెద్దలు సుదర్శన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ లతో మాట్లాడుతూ ఈ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్న సంగతి గుర్తు చేశారు. ఒక స్థాయిలో రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తో వ్యవసాయ శాఖ సెక్రెటరీ తో ఎప్పటికప్పుడు సివిల్ సప్లై వాళ్ళతో సమన్వయపరుస్తూమని తెలిపారు. గత 15 రోజులుగా కేవలం ఈ పాడి ప్రపోర్మెంట్ పైన ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా రైతన్నకి ఇబ్బంది కడగకుండా మేము చేసిన ప్రయత్నాలు గమనించక పోవడం దురదృష్టం అని పేర్కొన్నారు.
ఈ విషయం లో బాల్కొండ నియోజకవర్గం లోని ఐకేపీ సెంటర్ వాళ్ళని అడిగి తెలుసుకోవాలని సూచించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం రోడ్ ఎక్కడం వల్ల ప్రజలకు వచ్చేది ఏమీ లేదన్నారు. మోహన్ రెడ్డి కావచ్చు సుదర్శన్ రెడ్డి కావచ్చు భూపతి రెడ్డి కావచ్చు ఈ జిల్లాకు సంబంధించిన నాయకులు ప్రతిరోజు రైతాంగం పక్షాన రైతుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలను పాటిస్తున్నామని తెలిపారు. వందకు వందశాతం రైతుల ప్రయోజనాల కోసం పాటుపడుతున్నటువంటి నాయకులమని మీరు గుర్తుంచుకోవాలన్నారు. రైస్ మిల్లర్ల దోపిడిని ఎవరి అరికట్టారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైస్ మిల్లర్ దోపిడీని అరికట్టినామని, కానీ మీరు గతంలో కరోనా టైం లో రైస్ మిల్లర్లను దోచుకున్నటువంటి వ్యక్తులు మీరు మీ పేర్ల కోసం వాళ్ల దగ్గర బియ్యాన్ని తీసుకొని మోసం చేసినటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రైతు సోదరులారా ఇలాంటి మోసపూరితమైన బీఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలు నమ్మకండని కోరారు. చివరి గింజ వరకు కొనడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ వైపే ప్రయత్నం చేస్తున్నారని, పూర్తిగా ధాన్యం కొనుగోలు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలియజేశారు. ప్రశాంత్ రెడ్డి లాంటి వాళ్ల మాటలు నమ్మొద్దని రైతు సోదరులకు విజ్ఞప్తి చేశారు. రైతుల క్షేమమే మా లక్ష్యం రేవంత్ రెడ్డి గారి లక్ష్యం రైతాంగం క్షేమంగా ఉండటం అని స్పష్టం చేశారు.
