srisailam l శ్రీశైలంలో జరిగిన సంఘటనపై ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి ఆరా…
srisailam l శ్రీశైలంలో జరిగిన సంఘటనపై ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి ఆరా…
భక్తుల రద్దీ వసతులపై ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ తో సమీక్ష.,..
srisailam l నంద్యాల బ్యూరో ఆంధ్రప్రభ: నంద్యాల జిల్లా లోని జ్యోతిర్లింగాలలో ఒకటేనా శ్రీశైలంలో వెలిసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి మహోత్సవాలు సందర్భంగా తీవ్రంగా స్పందించారు. శ్రీశైలం సహా వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి మంగళవారం చీఫ్ సెక్రటరీ విజయానందతో సమీక్ష సమావేశం నిర్వహించారు.బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ, సౌకర్యాలపై మంత్రులు, ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో పాటు ఇతర అధికారులతో ఢిల్లీ నుంచి రివ్యూ చేసిన సిఎం.
అధికారులు, జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను, సౌకర్యాలను సమీక్షించిన ముఖ్యమంత్రి. శివరాత్రి నాటికి శ్రీశైలంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పటిష్ట చర్యలు తీసుకోవాలని సిఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ,హోం మంత్రి అనిత ప్రత్యేక శ్రద్దతో ఏర్పాట్లు, వసతులపై అధికారులతో పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి మంత్రులకు సూచించారు.భక్తులకు ఇబ్బంది కలగకుండా, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి త్వరితగతిన దర్శనం పూర్తయ్యేలా, వసతి లభించేలా కార్యచరణ అమలు చేయాలని ఆదేశించారు. భక్తులు శివసేవకులు దీక్షలు, మాలధారణలతో ఎంతో కష్టపడి ఆలయానికి చేరుకునే భక్తులకు ఇబ్బంది కలిగేలా, అగౌరపరిచేలా ఎవరూ వ్యవహరించ కూడదని సీఎం సూచించారు. ప్రతిరోజు రోజు రోజుకూ దేవాలయాల్లో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. మహా శివరాత్రి పర్వదినం వంటి సందర్భాల్లో అన్ని విభాగాలు పూర్తి సమన్వయంతో పనిచేసేలా ఇప్పటి నుంచే పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు ముఖ్యమంత్రి సూచించారు.
