ఘనంగా శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు

ఘనంగా శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు

ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని శ్రీరామాలయంలోని శ్రీవాసవి కన్యక పరమేశ్వరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని గౌరీశెట్టి భారతమ్మ నాగభూషణరావు, శ్రీనివాసరావు విజయలలిత, రాధ, శివాజీ, హైమావతి వజ్రేశ్వర్రావు,శ్రీదేవి శేఖర్ లు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి జయంతి వేడుకలు అధికారికంగా నిరహించేందుకు జీవోను జారీ చేయడం ఎంతో గర్వకారణమని అన్నారు. ఆత్మాభిమానం, ధర్మం, అహింసా, పరిరక్షణకు ప్రతీకగా నిలిచిన అమ్మవారిని స్మరిస్తూ వాసవి కన్యకాపరమేశ్వరి పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఎంతో శుభపరిణామమని పేర్కొన్నారు. శ్రీవాసవి అమ్మవారి జయంతిని ఆర్యవైశ్యలు ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టి పలువురికి ఆదర్శప్రాయమైన దేవతగా అహింస, సత్యం, ధర్మం, సమానత్వం వంటి గొప్ప విలువలను బోధించిన మహనీయురాలని కొనియాడారు. వాసవి మాత జయంతి వేడుకలు ఆధ్యాత్మికత, సాంప్రదాయాలు గొప్ప విలువలతో కూడిన సేవల ప్రోత్సహించడమే కాకుండా, సమాజ ఐక్యతను మరింత బలోపేతం చేయడంలో ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు.

ఈ నిర్ణయం ఆర్యవైశ్య సమాజానికి మాత్రమే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలకు గౌరవకరమైనదని, మీ దూరదృష్టి నాయకత్వం సమాజపట్ల మీకున్న గౌరవానికి ఇది ఒకప్రతీకగా నిలుస్తుందని కృతజ్ఞత తెలిపారు. భవిష్యత్తులోని ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర అభివృద్ధికి మీ నాయకత్వం గొప్పదిగా కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గౌరిశెట్టి భారతమ్మ నాగభూషణరావు, శ్రీనివాసరావు, విజయలలిత, సంకా ప్రభాకర్ హైమావతి, సిరినోముల హైమావతి వజ్రేశ్వరరావు, నరేష్ భవాని, సతీషు సౌజన్య, శ్రీనివాసరావు, హరీష్, సురేష్, గౌరిశెట్టి శేఖర్ శ్రీదేవి, సంక కిరణ్ దంపతులు పాల్గొన్నారు.

Leave a Reply