Makthal | అయ్యప్ప దీక్ష చేపట్టిన 36మంది స్వాములు
Makthal | అయ్యప్ప దీక్ష చేపట్టిన 36మంది స్వాములు
Makthal | మక్తల్, ఆంధ్రప్రభ : హరిహర పుత్రుడు శబరిమల వాసుడు శ్రీ మణికంఠుడు అయ్యప్ప స్వామి మాలధారణ (Ayyappa Swamy Maladharan) కార్తీకమాసం చివరి బుధవారం కావడంతో ఈరోజు నారాయణపేట జిల్లా మక్తల్ (Makthal) పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో 36మంది స్వాములు అయ్యప్ప దీక్షను చేపట్టేందుకు మాల ధరించారు. అశోక్ గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో ఒకేసారి 36మంది స్వాములు మాల ధరించి అయ్యప్ప దీక్షను చేపట్టారు. ఈసందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గురుస్వామి అశోక్ గౌడ్ (Ashok Goud) మాట్లాడుతూ… మాల ధరించిన స్వాములకు అయ్యప్ప దీక్ష నియమావళిని వివరించారు. అయ్యప్ప దీక్ష సమయంలో నియమనిష్ఠలతో ఉండాలని సూచించారు. అయ్యప్ప మాల నిబంధనలు ఏమాత్రం అతిక్రమించకుండా మాల ధరించి మకర సంక్రాంతి రోజున ఇరుముడి ధరించి అయ్యప్ప కొండపై అయ్యప్ప జ్యోతిని దర్శించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు పవన్ గౌడ్, శ్రీధర్ గౌడ్, పసుల రంజిత్ రెడ్డి, శేఖర్ రెడ్డితో పాటు అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు.
