Alliance Victory | అస్సాం సీఎంగా రెండోసారి బాధ్యతలు

Alliance Victory | అస్సాం సీఎంగా రెండోసారి బాధ్యతలు

Alliance Victory | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : హిమంత బిశ్వశర్మ అస్సాం ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన నేపథ్యంలో ఆయన వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, తదితర ప్రముఖులు హాజరయ్యారు. పార్టీ శ్రేణులు, పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మరోసారి విజయం సాధించడంతో హిమంత బిశ్వశర్మ నాయకత్వంపై పార్టీ నమ్మకం వ్యక్తం చేసింది. రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతులు, పెట్టుబడుల ఆకర్షణపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టనున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో (2026) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కూటమి చారిత్రాత్మక హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించింది. దీంతో 2016, 2021 తర్వాత 2026లో కూడా బీజేపీ అస్సాంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రికార్డు సృష్టించింది. అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక‌ల జ‌ర‌గ‌గా బీజేపీ-ఏజీపీ (AGP) కూటమి 100కు పైగా సీట్లను కైవసం చేసుకుని స్పష్టమైన మెజారిటీని సాధించింది.

హిమంత బిశ్వశర్మ వరుసగా రెండోసారి సీఎం కానున్నారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది, బీజేపీ-NDA కూటమి ఏకపక్ష విజయాన్ని సాధించింది. అస్సాం రాజకీయ చరిత్రలో కాంగ్రెసేతర పార్టీ వరుసగా మూడోసారి గెలవడం ఇదే మొదటిసారి. ఈ విజయంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ, అస్సాం ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని పేర్కొన్నారు. హిమంత బిస్వా శర్మ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మరియు భద్రత ప్రధాన అంశాలుగా ఈ ఎన్నికలు జరిగాయి.కాంగ్రెస్ పరిస్థితి: కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయి, ప్రధాన ప్రతిపక్షంగా కూడా నిలబడలేకపోయింది.

ప్రధాని మోదీ నాయకత్వం, హిమంత బిస్వా శర్మ పాలనపై ప్రజలు నమ్మకం ఉంచారు. అసోం గణ పరిషత్ (AGP), ఇతర స్థానిక పార్టీలతో పొత్తులు బలంగా పనిచేసాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల మెరుగుదల, అక్రమ చొరబాట్ల నియంత్రణ వంటి అంశాలు బీజేపీకి సానుకూలంగా మారాయి.

Leave a Reply