Singapore Open | షటిల్‌కాక్ స్పీడ్‌తో ఫైనల్స్‌కు భారత్ జోడీ…

Singapore Open | షటిల్‌కాక్ స్పీడ్‌తో ఫైనల్స్‌కు భారత్ జోడీ…
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : సింగపూర్ ఓపెన్ (Singapore Open) సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి – చిరాగ్ శెట్టి సంచలన ప్రదర్శన చేశారు. ఈరోజు (శనివారం) జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్‌లో ప్రపంచ ఛాంపియన్, టాప్ సీడ్ అయిన కొరియా జంటను.. మనోళ్లు మట్టి కరిపించి.. షటిల్ కాక్ స్పీడ్ తో ఫైనల్‌కు దూసుకెళ్లారు.
టోర్నమెంట్‌లో 4వ సీడ్‌గా బరిలోకి దిగిన భారత్ జోడీ… ప్రపంచ నంబర్ 1, టాప్ సీడ్ అయిన కొరియాకు చెందిన కిమ్ వోన్ హో – సియో స్యుంగ్ జే జోడీపై వరుస గేముల్లో విజయం సాధించారు. 52 నిమిషాల పాటు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో సాత్విక్-చిరాగ్ ద్వయం 21-19, 21-18 తేడాతో కొరియా జోడీని చిత్తు చేశారు.
ఆదివారం ఫైనల్ పోరు…
ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ.. రెండో సెమీఫైనల్ విజేతతో టైటిల్ కోసం తలపడనున్నారు.
ఇండోనేషియాకు చెందిన ఫజర్ అల్ఫియాన్ – ముహమ్మద్ షోహిబుల్ ఫిక్రి (3వ సీడ్) వర్సెస్ చైనాకు చెందిన లియాంగ్ వీ కాంగ్ – చాంగ్ వాంగ్ రెండో సెమీఫైనల్లో తలపడుతున్నారు.
మిక్స్‌డ్ డబుల్స్‌లో నిరాశ..
మరోవైపు మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత ప్రయాణం ముగిసింది. సెమీఫైనల్‌లో భారత జంట ధ్రువ్ కపిల – తనీషా క్రాస్టో 16-21, 21-17, 13-21 తేడాతో జపాన్‌కు చెందిన యుయిచి షిమోగామి – సయాకా హోబరా జోడీ చేతిలో ఓటమి పాలయ్యారు.
