శ్యామా ప్రసాద్ ముఖర్జీ త్యాగాలు స్ఫూర్తిదాయకం..
సూర్యాపేట, ఆంధ్రప్రభ : దేశ సమగ్రత, జాతీయ ఏకత్వం కోసం శ్యామా ప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి అన్నారు మంగళవారం స్థానిక భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివాస్ సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించి మాట్లాడారు.
భారతదేశ ఐక్యత కోసం ఆయన చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రుక్మారావు, కార్మిక సంఘ జిల్లా కన్వీనర్ శేషగిరి, ప్రధాన కార్యదర్శి ఫణి, ఉపాధ్యక్షులు పాండురంగాచారి, బిక్షమయ్య, ఆఫీస్ సెక్రటరీ రవివర్మ, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, మండల నాయకులు మన్మధరెడ్డి, వెంకటరెడ్డి, మాల్సుర్ గౌడ్, వెంకన్న, పరశురామ్, రావినాయక్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
