బాజిప్రసాద్ ఆశయసాధనకు కృషి చేస్తాం..

  • ఎన్టీఆర్ జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్

(విజయవాడ, ఆంధ్రప్రభ) : దేవినేని బాజిప్రసాద్ 10వ వర్ధంతి కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయం లో అభిమానులు,వైస్సార్సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ పారిశ్రామిక వేత్తగా వ్యాపార రంగంలో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న దేవినేని బాజి ప్రసాద్ చిరస్మరణీయులుని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. విజయవాడలో రాజకీయాల అతితంగా నాడు పేద విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలు, వివక్ష చూసి యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వారికి అండగా నిలిచిన బాబాయి స్వర్గీయ దేవినేని బాజి ప్రసాద్ ఆశయసాధనకు కృషి చేసారు అని అన్నారు.

విజయవాడ నగరం, ఉమ్మడి కృష్ణా జిల్లా దేవినేని నెహ్రూ, బాజీ ప్రసాద్, గాంధీ, మురళి సేవలను ప్రజలు గుర్తుంచుకుంటారు అని అన్నారు.నేడు భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా విద్యార్థులు ఇప్పటికి ఆయన సేవలను గుర్తుచేసుకొంటారని అంతలా ఆయన వారి గుండెల్లో నిలిచివున్నారని తెలిపారు.వారి ఆశయాలకు అనుగుణంగా అందరం కలిసి ముందుకు సాగుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, మాజీ డిప్యూటీ మేయర్లు ముసునూరు సుబ్బారావు, ఆళ్ల చెల్లారావు,మాజీ కార్పొరేటర్లు కలపాల అంబేద్కర్,మండల అధ్యక్షులు గద్దె కళ్యాణ్,సాయి కృష్ణా,పంతాల సాయి,వైస్సార్సీపీ నాయకులు చినబాబు, మెయిన్, కోటి నాగులు, జోగా రాజు, బచ్చు మాధవి, సుజాత, సునీత, సుభాషిణి, బచ్చు మురళి, రాజ్ కమల్, ప్రకాష్, చింతా బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.