యువత సంక్షేమానికి కృషి చేస్తా
యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శివరామకృష్ణ
కాల్వ శ్రీరాంపూర్, ఆంధ్రప్రభ: యువత సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు సోన్నాయిటెంకం శివరామకృష్ణ అన్నారు. మండల కేంద్రంలో నేషనల్ యూత్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో టపాసులు పేల్చి, కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ తన పనితీరును గుర్తించి రెండోసారి మండల యూత్ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, యువత సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రానున్న రోజుల్లో విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై ముందుండి పోరాడుతామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ మునీర్, సర్పంచులు బంగారి రమేష్, జిన్నా రామచంద్రరెడ్డి, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రాజమల్లు, కాంగ్రెస్ ఉప సర్పంచ్ గోలి సుధాకర్, మాజీ సర్పంచ్ మాదాసి సతీష్, మార్కెట్ డైరెక్టర్ ఎనిగంటి రవి, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
