పవర్‌గూడలో వివో భవన నిర్మాణానికి భూమిపూజ

జైనూర్, ఆంధ్రప్రభ : పవర్ గూడ పంచాయతీ గ్రామ ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించడంతో పాటు గ్రామాభివృద్ధికి మరింత ఊతమివ్వాలనే లక్ష్యంతో పవర్‌గూడగ్రామపంచాయతీలో విఓ భవన నిర్మానం చేపట్టడం జరుగుతుందని సర్పంచ్ తొడసం రాజేందర్ అన్నారు. సోమవారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పవర్ గూడ లో పది లక్షలతో నూతనంగా నిర్మించే వివో భవన నిర్మాణ పనులకు సర్పంచ్ రాజేందర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ పనులు నాణ్యతతో త్వరగానే నిర్మించేలా కృషి చేయాలని వివో సంఘ మహిళలకు ఆయన కోరారు. భవన నిర్మాణంతో సంఘాల మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ డోంగ్రే ప్రకాష్, వివో సంఘ మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు.