Shiva | చిన్నా చెప్పిన సంచలన విషయాలు..

Shiva | చిన్నా చెప్పిన సంచలన విషయాలు..

Shiva, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆర్టిస్ట్ జితేందర్ రెడ్డి అంటే.. ఎవరికీ తెలియకపోవచ్చు. అదే.. చిన్నా (Actor Chinna) అంటే మాత్రం ఠక్కున గుర్తొస్తారు. ఆయన పేరు చెప్పగానే ముందు గుర్తొచ్చేది శివ సినిమా. ఆ సంచలన సినిమాలో గొడవ అంటే ముందుండేది చిన్నానే. ఇంకా చెప్పాలంటే.. నాగార్జున కంటే ముందు.. నాగార్జున కంటే దూకుడుగా రియాక్ట్ అయ్యే క్యారెక్టర్. అలాగే నాగార్జున ఎప్పుడూ చిన్నా గురించే మాట్లాడేవారు. ఓ ఫైట్ సీన్ లో.. చిన్నా రాడ్ ఇవ్వరా అని అంటారు నాగార్జున. ఆ డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. శివ సినిమా తర్వాత చిన్నా లైఫే మారిపోయింది.

Shiva

Shiva | చిన్నా ముందు ఊహించారా..?

శివ సినిమా తెలుగు సినిమా నడతను మార్చిన సంచలన చిత్రం. శివ సినిమా రిలీజై 36 సంవత్సరాలు అయినా ఇంకా శివ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే.. ఆ సినిమా తెలుగు తెర పైనే కాదు.. ఇండియన్ సినిమా పైనే ఎంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. అయితే.. ఈ సినిమాతో బాగా పాపులర్ అయిన చిన్నా.. ఎవరి ఇన్ స్పిరేషన్ తో ఇండస్ట్రీలోకి వచ్చారు..? చిన్నాకు రాజకీయాలతో ఉన్న లింక్ ఏంటి..? శివ సినిమా సెట్ లో నాగార్జున (Nagarjuna), అమల ఎలా ఉండేవారు..? వాళ్ల ప్రేమకథ గురించి ముందుగా చిన్నాకు తెలుసా..? వర్మ సెట్ లో ఎలా ఉండేవారు..? అసలు శివ సినిమా ఇంతలా సంచలనం సృష్టిస్తుందని చిన్నా ముందు ఊహించారా..? ఇలా చిన్నా చెప్పిన ఎన్నో పెద్ద పెద్ద విషయాలు.. ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా…? అయితే.. ఆంధ్రప్రభ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్ వ్యూ చూడాల్సిందే.

Click Here To Read మద్రాస్, తెలంగాణ, ఏపీ గురించి భలే చెప్పారే..

Click Here to Read More