నెంబర్ 1 ప్లేస్ లో.. తెలంగాణ..

నెంబర్ 1 ప్లేస్ లో.. తెలంగాణ..

తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 ప్లేస్ లో నిలిచింది. జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ ప్రచారంలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో తెలంగాణ అఖండ ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ నెల 18న న్యూఢిల్లీలో విజ్ఞాన భవన్ లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము 6 జాతీయ జల అవార్డులతో పాటు ఈ పురస్కారం ప్రదానం చేయనున్నారు. తెలంగాణలో ఏకంగా 5,20,362 కృత్రిమ రీఛార్జ్, నీటి నిల్వల నిర్మాణాలను పూర్తి చేసి తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఛత్తీష్ గఢ్, (4.05,563), రాజస్థాన్ (3,64,968) ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. తెలంగాణతో పాటే జిల్లాల విభాగంలోనూ తెలంగాణ హవా కొనసాగింది.

సదరన్ జోన్ కేటగిరి 1 లో తొలి మూడు ర్యాంకులను తెలంగాణ జిల్లాలే కైవసం చేసుకోవడం విశేషం. ఆదిలాబాద్ (98, 693 పనులు) జిల్లాకు 2 కోట్ల నగదు బహుమతితో ప్రధమ స్తానం లభించింది. నల్గొండ (84,827 పనులు) ద్వితీయ స్థానం, (2 కోట్లు) సాధించింది. మంచిర్యాల (84,549 పనులు) మూడో స్థానం (2 కోట్లు) దక్కించుకుంది. వీటితో పాటు కేటగిరి 2 లో వరంగల్, నిర్మల్, జనగాం జిల్లాలు, కేటగిరి 3 లో భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్ జిల్లాలు కూడా అవార్డులకు ఎంపిక అయ్యాయి.

Leave a Reply