Shalibanda | పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం

Shalibanda | పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం

  • ఎలక్ట్రానిక్ షోరూం దగ్ధం

ఆంధ్ర్రప్ర‌భ : పాతబస్తీ శాలిబండ ప్రాంతంలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక ఎలక్ట్రానిక్ వస్తువుల షోరూంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి.. క్షణాల్లోనే అత్యంత తీవ్రరూపం దాల్చాయి. దాంతో ప్రాంతమంతా నల్లటి పొగ కమ్ముకుంది.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా శాలిబండ రోడ్డుపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

మంటల తీవ్రత కారణంగా షోరూంలో ఉన్న ఎలక్ట్రానిక్ సరుకులు పెద్ద ఎత్తున దగ్ధమైనట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనలో షోరూం సమీపంలో పార్క్ చేసి ఉన్న ఒక కారు పూర్తిగా దగ్ధమైనట్లు తెలిసింది. మంటలను నియంత్రించేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తుండగా, ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు.

Leave a Reply