హైదరాబాద్: ఫార్ములా (Formula) ఈ రేసింగ్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఈరోజు ఏసీబీ(ACB ) విచారణకు హాజరుకానున్నారు. కేటీఆర్ ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ కు (Telangana) రానున్నారు..
తెలంగాణ భవన్ నుంచి పది గంటలకు ఎసిబి (ACB ) కార్యాలయంలో విచారణ కు వెళ్లనున్నారు. ఈ కారు రేసు కేసులో నీధుల మళ్లింపు, క్యాబినెట్ అనుమతి లేకుండా నిర్ణయం, సచివాలం బిజినెస్ రూల్స్ ఉల్లంఘనపై కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించనున్నది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్‌ను ఏసీబీ, ఈడీలు విచారించాయి.
ఫార్ములా ఈ-ఆపరేషన్స్ సంస్ధ ప్రతినిధులను గతంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ ప్రశ్నించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నాటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలను విచారించింది. కేటీఆర్ విచారణ అనంతరం ఏసీబీ ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేయనున్నది.
కేటీఆర్ వెంట బీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఏసిబి కార్యాలయం వచే అవకాశాం ఉంది. ఈ నేపథ్యంలో ఏసిబి కార్యలయం రూట్ మ్యాప్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.