రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో గురుకుల విద్యార్థి ప్రతిభ

డిస్కస్‌ త్రోలో మూడో స్థానం సాధించిన సాత్విక్‌

చెన్నూర్, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల కళాశాల ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థి జె. సాత్విక్‌ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచినట్లు గురుకుల ప్రిన్సిపాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 6, 7 తేదీల్లో వరంగల్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి యూత్‌ అసోసియేషన్‌ మీట్‌ అథ్లెటిక్స్‌ అండర్‌-18 విభాగంలో సాత్విక్‌ పాల్గొన్నారు. డిస్కస్‌ త్రోలో 34.97 మీటర్ల దూరం విసిరి రాష్ట్రస్థాయిలో మూడో స్థానాన్ని సాధించినట్లు ప్రిన్సిపాల్‌ తెలిపారు.

అథ్లెటిక్స్‌లో ప్రతిభ కనబరిచిన సాత్విక్‌ను కళాశాల అధ్యాపకులు, తోటి విద్యార్థులు అభినందించారు.