మూడోసారి ఏకగ్రీవంగా ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడిగా సునార్కని రాంబాబు

కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ: కన్నాయిగూడెం మండల కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడిగా చింతగూడెం గ్రామానికి చెందిన సునార్కని రాంబాబు మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి సీతక్క, జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మాట్టేవాడ తిరుపతి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు.

ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో మూడోసారి ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన మంత్రి సీతక్కకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను నిత్యం ప్రజాసేవకు అంకితం చేస్తూ, కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ముందుకు సాగుతానని అన్నారు.

తన ఎన్నికకు సహకరించిన జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్‌, యువనేత కుంజ సూర్య, కన్నాయిగూడెం మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జాడి రాంబాబు, జిల్లా సీనియర్‌ నాయకుడు ఎండీ అప్సర్‌ పాషా, గ్రంథాలయ చైర్మన్‌ బానోత్‌ రవిచందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రేగా కళ్యాణి, జిల్లా కార్యదర్శి బొల్లె భాస్కర్‌, కన్నాయిగూడెం మండల యూత్‌ అధ్యక్షుడు బోట నాగేష్‌, మాజీ జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు దాసరి సుధాకర్‌తో పాటు మండల, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు, యువజన నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, సీనియర్‌ నాయకులు, కార్యకర్తలకు రాంబాబు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

మూడోసారి బాధ్యతలు చేపట్టిన సునార్కని రాంబాబుకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.