సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ క్షేత్రస్థాయి పర్యటన..

ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ : ఖమ్మం నగరంలోని పాండురంగాపురం (డివిజన్–02), బల్లేపల్లి (డివిజన్–03), లోటస్ హిల్స్ (డివిజన్–16) ప్రాంతాల్లో సుడా నిధులతో చేపడుతున్న రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ బుధవారం పరిశీలించారు.

మూడు డివిజన్లలో సుమారు రూ.3 కోట్ల వ్యయంతో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. పనుల నాణ్యత, నిర్మాణ ప్రమాణాలు మరియు వేగవంతమైన అమలుపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (EE), డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (Dy.EE), అసిస్టెంట్ ఇంజినీర్ (AE) పనుల వివరాలను సమీక్షించారు. స్థానిక ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందేలా పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.

సుడా ఆధ్వర్యంలో నగర అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సుడా చైర్మన్ తెలిపారు.

Leave a Reply