Sarpanch | ఆదరించండి.. అభివృద్ధి చేస్తా..

Sarpanch | జూలూరుపాడు, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గాంధీనగర్ గ్రామ పంచాయతీ బరిలో నిలిచిన అభ్యర్థి బానోత్ మంగీలాల్ (ఎల్ఐసీ) ప్రజలను కోరారు. ఆదివారం గాంధీ నగర్ పంచాయతీ పరిధిలో మంగీలాల్ నాయక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంగీలాల్ నాయక్ మాట్లాడుతూ.. ప్రజల ఆశీస్సులతో ఎన్నికల బరిలో నిలిచానని, గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

గంగారం, రామకృష్ణ పురం, గాంధీనగర్ గ్రామాల్లో జూలూరుపాడు చంద్రుగొండ వెళ్ళే రహదారికి ఇరువైపుల సైడ్ డ్రైనేజీల నిర్మాణం, అవసరమైన చోట నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు, పొలాలకు వెళ్ళే డొంక దారులను రైతులకు ఇబ్బందులు పడకుండా రోడ్లను అభివృద్ధి, వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పెన్షన్లు, సీసీ రహదారులు, విద్యుత్ దీపాలు, తాగునీరు సరఫరాకు కృషి చేస్తారని ప్రజలకు హామీ ఇచ్చారు. వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సహకారంతో గాంధీనగర్ గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఓటర్లకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశీస్సులతో ఎన్నికల బరిలో నిలిచిన తనను అత్యధిక మెజార్టీతో సర్పంచ్ గా గెలిపించారని అభ్యర్థించారు.