సర్దార్ గౌతు లచ్చన్న జీవితం ఆదర్శప్రాయం…

మచిలీపట్నం – ఆంధ్రప్రభ : మచిలీపట్నం బస్టాండ్ సెంటర్‌లో నిర్వహించిన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, సీనియర్ నాయకులు కొనకళ్ల జగన్నాథరావు, గొర్రెపాటి గోపీచంద్, డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, బీజేపీ నాయకులు సోడిశెట్టి బాలాజీ గారితో కలిసి లచ్చన్న విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహానేత సర్దార్ గౌతు లచ్చన్న అన్నారు. సామాజిక సమానత్వం, పేదల సంక్షేమం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయాలు, స్ఫూర్తి నేటి తరాలకు మార్గదర్శకం. సర్దార్ గౌతు లచ్చన్న పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ ఘన నివాళి అర్పిస్తున్నానని మంత్రి అన్నారు.