లచ్చన్న ఆశయ సాధనకు కృషి చేయాలి

విక్కుర్తి శ్రీనివాసరావు


అవనిగడ్డ – ఆంధ్రప్రభ : అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం కేక్ కట్ చేసి లచ్చన్న జయంతి వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా విక్కుర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ… సర్దార్ గౌతు లచ్చన్న బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన గొప్ప ప్రజా నాయకుడని కొనియాడారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనడంతో పాటు, సామాజిక న్యాయం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, పేదలు, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం లచ్చన్న చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను నేటి తరానికి అందించడంతో పాటు, సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు విక్కుర్తి రాంబాబు, కొల్లూరి వెంకటేశ్వరరావు, యాసం చిట్టిబాబు, బండే రాఘవ,బచ్చు రఘునాథ్, మెగావత్తు గోపి, దాసినేని శ్రీనివాసరావు, పర్చూరి దుర్గాప్రసాద్, చెన్ను బాబూరావు, మొఘల్ మురాద్, డేగల రాఘవ, లింగం బాబూరావు, కంచర్ల కోటేశ్వరరావు, నాగిడి రాంబాబు, సిద్దాబత్తుని హరిబాబు, అడపా వెంకటేశ్వరరావు, న్యాయవాది విక్కుర్తి రామక్రిష్ణ, పులిగడ్డ చంద్ర, బర్మా బుజ్జి, అడపా వెంకటేశ్వరరావు, తాడేపల్లి రంగనాథ్, తదితరులు పాల్గొన్నారు.