కనకదుర్గమ్మను దర్శించుకున్న నిర్మాత కొణిదెల నిహారిక
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలోని కనకదుర్గమ్మవారిని ప్రముఖ చలనచిత్ర నిర్మాత కొణిదెల నిహారిక ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు సమర్పించారు. ఆలయానికి విచ్చేసిన నిర్మాత నిహారికకు దేవస్థాన అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.
