సీఎం పర్యటనకు భారీగా కాంగ్రెస్ శ్రేణుల తరలింపు
వాజేడు, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ములుగు జిల్లా పర్యటన సందర్భంగా వాజేడు మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాకర్లపూడి విక్రాంత్ నేతృత్వంలో భారీగా తరలివెళ్లారు. మొత్తం 58 కార్లు, మూడు బస్సులు, మూడు మ్యాజిక్ వాహనాలు, ఒక డీసీఎం వాహనంలో సుమారు వెయ్యి మందికి పైగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పర్యటనకు బయలుదేరారు. ఈ కార్యక్రమాన్ని భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు జెండా ఊపి ప్రారంభించారు.
ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడంలో భాగంగా పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివెళ్లాయి. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు వత్సవాయి జగన్నాథరాజు, కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు చెన్నం ఎల్లయ్య, జిల్లా నాయకుడు పోలూరి వేణు, కాంగ్రెస్ పార్టీ నాయకులు దాట్ల సీతారామరాజు, మాజీ జెడ్పీటీసీ అల్లరి పుష్పలత పాల్గొన్నారు. నాగారం సర్పంచ్ బోధ బోయిన స్వరూప, గుమ్మడిదొడ్డి సర్పంచ్ బోదెబోయిన భరత్‌కుమార్, తల్లాడి ఆదినారాయణ, యువ నాయకులు కాకర్లపూడి కళ్యాణ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గౌరారపు సర్వేశ్వరరావుతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
