లచ్చన్న ఆశయాలను నేటి తరానికి అందించాలి..

టిడిపి ఆధ్వర్యంలో గుడివాడలో ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు….
17వ వార్డులో లచ్చన్న విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం లచ్చన్న పోరాటం స్ఫూర్తిదాయకం : ఎమ్మెల్యే రాము


గుడివాడ, ఆగస్టు 16 (ఆంధ్రప్రభ ) : గుడివాడ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు ఆదివారం ఉదయం ఘనంగా జరిగాయి. 17వ వార్డులోని ఓల్డ్ సంత బజార్ రోడ్డులో ఉన్న సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి కూటమి నాయకులు, బీసీ సంఘాల నాయకులతో కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా “జోహార్ సర్దార్ లచ్చన్న” అంటూ ఎమ్మెల్యే రాము, కూటమి నాయకులు నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే రాము మిఠాయిలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ… సర్దార్ గౌతు లచ్చన్న ఆశయాలను నేటి తరానికి అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం లచ్చన్న చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన జీవితాంతం కృషి చేశారని గుర్తుచేశారు.

సమాజంలో అణగారిన వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా సముచిత స్థానం కల్పించాలన్నదే లచ్చన్న లక్ష్యమని… ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని ఎమ్మెల్యే రాము అన్నారు.ప్రజాసేవకు, సామాజిక న్యాయానికి ప్రాధాన్యతనిస్తూ సర్దార్ లచ్చన్న చూపిన మార్గంలో నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.గుడివాడలో అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు.

జయంతి వేడుకల్లో జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ టిడిపి అధ్యక్షుడు పండ్రాజు సాంబశివరావు, టిడిపి నాయకులు లింగం ప్రసాద్, రామదేని వేణుబాబు, చేకూరు జగన్మోహన్ రావు, దేవరపల్లి కోటి, సురగని సూరిబాబు, యార్లగడ్డ సుధారాణి, ఏడుకొండలు, మరీదు రోహిణి కుమార్, మరీదు కరుణకుమారి, మద్దుకురి ప్రభాకర్, సొంటి శ్రీనివాస్, శ్రీనివాస్, సొంటి కోటయ్య, షేక్ మీరా షరీఫ్, సొంటి అయ్యప్ప, మానం రమేష్, రమణ, రావులమ్మ రఫీ, నాగరాణి, పలువురు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.