Indrakeeladri | భక్తులతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి…
వరుస సెలవులతో పోటెత్తిన భక్తులు
ఒక్కరోజే 60,741 మందికి అమ్మవారి దర్శన భాగ్యం..
రూ.4.09 లక్షల విరాళాలు…
2,904 మంది తలనీలాలు సమర్పణ
11,113 మందికి అన్నప్రసాదం..
అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు..
Indrakeeladri | (ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వరుస సెలవుల నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిశాయి. అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.

శనివారం వివరాలు ఇలా..
ఆగస్టు 15న మొత్తం 60,741 మంది భక్తులు కనకదుర్గమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం కోసం 13,932 టికెట్లు జారీ చేశారు. భక్తులు అమ్మవారికి సమర్పించిన విరాళాల ద్వారా రూ.4,09,916 ఆదాయం లభించింది. వివిధ సేవల్లో 395 మంది పాల్గొన్నారు. 2,904 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అమ్మవారి ఆలయంలో భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాదాలను అందుబాటులో ఉంచారు. మొత్తం 1,06,602 ప్రసాద యూనిట్లు పంపిణీ చేయగా, అన్నదానంలో 11,113 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు.

వైభవంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
ఇదిలా ఉండగా, ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అధికారులు, సిబ్బంది సమక్షంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ విధుల్లో ఉత్తమ సేవలు అందించిన పలువురు ఉద్యోగులను అధికారులు ప్రశంసించి అభినందించారు.


