బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఎంతో మంది స్టార్ కిడ్స్‌లో సారా అలీ ఖాన్ ఒకరు. ఈమె సినిమాలపై ఆసక్తితో 2018లో కేదార్‌నాథ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా ఆ సినిమా కమర్షియల్‌గా మంచి విజయాన్ని కట్టబెట్టింది. దాంతో సారా అలీ ఖాన్ కి బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వచ్చాయి. గత ఏడాది ఈమె నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
వాటిల్లో మర్డర్ ముబారక్ లో సారా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఏ వాటన్ మేరే వాటన్ సినిమాలోనూ నటించి మెప్పించింది. ఇక ఈ ఏడాదిలోనూ సారా అలీ ఖాన్ బిజీ బిజీగా ఉంది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఎక్కువ సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ ఏడాదిలో స్కై ఫోర్స్ సినిమాలో నటించింది. ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక సోషల్ మీడియాలో సారా అలీ ఖాన్ రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 45 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న సారా అలీ ఖాన్ తాజాగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పొట్టి గౌనులో ఆకట్టుకుంది. ఈ రేంజ్‌లో అందాల ఆరబోత కేవలం సారా అలీ ఖాన్‌కే సాధ్యం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అందంగా కనిపించే సారా అలీ ఖాన్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. స్కిన్ టోన్ ఔట్ ఫిట్‌లో సాధారణంగా ముద్దుగుమ్మలు ఎబ్బెట్టుగా ఉంటారు. కానీ ఈ ఫోటోల్లో మాత్రం ఆమె చాలా అందంగా కనిపిస్తుంది. అంతే కాకుండా అంతకు మించి అన్నట్లుగా ముద్దుగుమ్మ ఆకట్టుకుంటూ ఉంది.


