కాంగ్రెస్ అభ్యర్థి నవాజుద్దీన్‌ను గెలిపించండి

కాంగ్రెస్ అభ్యర్థి నవాజుద్దీన్‌ను గెలిపించండి
టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : చెయ్యి గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని బలపరిచి 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మహమ్మద్ ఖాజా నవాజుద్దీన్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ఓటర్లను కోరారు. ఆదివారం సంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి నవాజుద్దీన్‌కు మద్దతుగా ఆమె ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి పనులకు సమృద్ధిగా నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుందని, పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే వార్డుల అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, రానున్న రోజుల్లో మౌలిక వసతుల కల్పనకు నిరంతరం శ్రమిస్తామని ఆమె హామీ ఇచ్చారు. అధికారంలో ఉన్న పార్టీని గెలిపిస్తే కేంద్ర, రాష్ట్ర స్థాయిలో అధిక నిధులు తెచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని 6వ వార్డు ఓటర్లకు భరోసా ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
