ఇసుక తరలిస్తున్న టిప్పర్లను పట్టుకున్న పోలీసులు…..

ఇసుక తరలిస్తున్న టిప్పర్లను పట్టుకున్న పోలీసులు…..

వీరులపాడు, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను వీరులపాడు పోలీసులు శుక్రవారం అర్ధ రాత్రి పట్టుకున్నారు. కంచికచర్ల మండలం గనీ ఆత్కూరు కృష్ణా నది నుండి అక్రమంగా తెలంగాణ రాష్ట్రానికి టిప్పర్ లలో ఇసుక తరలిస్తున్నట్టు సమాచారం రావడంతో పెద్దాపురం బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద పట్టుకోవడం జరిగిందని ఎస్ఐ అభిమన్యు నాయక్ తెలిపారు. ఆంధ్ర నుండి తెలంగాణ రాష్ట్రానికి ఇసుక తరలించేందుకు ఎటువంటి అనుమతులు లేవని అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు.

పట్టుబడిన లారీల డ్రైవర్లు, యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం, ఎర్రుపాలెం మండలం, మీనఓలు గ్రామం వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల నిమిత్తం ఇసుకను తరలిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు.మేఘ కంపెనీ కీ చెందిన లారీలు గా గుర్తించమన్నారు. ఇసుక రవాణాపై బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద నిరంతరం నిఘా ఉంటుందని అక్రమ రవాణాకు పాల్పడే వారిపై పీడి యాక్ట్ లు నమోదు చేయడం జరుగుతుందన్నారు.

Leave a Reply