Food Supply | వైరల్ ఫోటోల వెనక నిజాలివే..

Food Supply | వైరల్ ఫోటోల వెనక నిజాలివే..
Food Supply | వైరల్ ఫోటోలు కలకలం: ఖాళీ ప్లేట్ల వెనక కథ
ఫోర్ట్ కావజోస్‌లో సిబ్బంది కొరత తీవ్రం
మూసివేతలు, దూరం… సైనికులకు ఇబ్బందులు
సప్లై చైన్ దెబ్బ: పెంటగాన్ వైఫల్యం?
జంక్ ఫుడ్ వైపు సైనికులు… ప్రతిష్టకు దెబ్బ
Food Supply | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఖాళీ ప్లేట్లు, అరకొర భోజనం ఫోటోలు చూసి ప్రపంచం ముక్కున వేలేసుకుంటోంది. అగ్రరాజ్యం అమెరికాకు తిండి కటకట ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇది దేశంలో ఉన్న కరువు వల్ల వచ్చింది కాదు, కేవలం అమెరికా సైనిక యంత్రాంగంలోని లోపాల వల్ల తలెత్తిన సమస్య.
ముఖ్యంగా ఫోర్ట్ కావజోస్ వంటి అతిపెద్ద సైనిక స్థావరాలలో వంట చేసే సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని సమాచారం. దీనికి తోడు మెయింటెనెన్స్ పేరుతో అనేక డైనింగ్ హాళ్లను మూసివేయడం కూడా ఒక ముఖ్య కారణంగా తెలుస్తోంది.. ఉన్న ఒకటి రెండు హాళ్లు కూడా సైనికులు నివసించే చోటుకు మైళ్ల దూరంలో ఉండటంతో, వ్యాయామాలు చేసి అలసిపోయిన సైనికులు అంత దూరం వెళ్లలేక పస్తులు ఉండవలసి రావడం కూడా ఒక సమస్యగా పరిణమించింది.
అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) సైనికుల భోజనం కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నప్పటికీ, క్షేత్ర స్థాయిలో సరఫరా గొలుసు (సప్లై చైన్ దెబ్బతినడం) మరో కారణం. మీల్ కార్డులు బోలెడున్నా భోజనం దొరకక, సైనికులు తమ సొంత డబ్బుతో బయట జంక్ ఫుడ్ కొనుక్కుని తింటున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇది అమెరికా రక్షణ వ్యవస్థ ప్రతిష్టను గ్లోబల్ లెవల్లో దెబ్బతీస్తోంది.
