ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యయత్నం
ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యయత్నం
- పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం
ఆంధ్రప్రభ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ జిల్లా నర్సంపేట బస్ డిపోలో డ్రైవర్ కోల శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. నిన్నటి నుంచి జరుగుతున్న సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ ఘటనకు పాల్పడినట్లు తోటి కార్మికులు చెబుతున్నారు. 90% కాలిన గాయాలతో ఉన్న డ్రైవర్ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు . తోటి కార్మికులు నడుస్తున్న బస్సుల పైకి దాడికి ప్రయత్నించగా సిఐ శ్రీనివాస్ ఎస్ఐ అరుణ్ సిబ్బంది తో అడ్డుకొని శాంతింప చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు.
