పార్థివా దేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండలం నిండిగొండ గ్రామ ఉప సర్పంచ్ గంగిడి లక్ష్మారెడ్డి మంగళవారం తెల్లవారుజామున ఆకస్మిక గుండెపోటుతో మరణించగా ఆయన పార్థివా దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. లక్ష్మారెడ్డి ఆకస్మిక మరణం బాధాకరమని అన్నారు.

మండల కాంగ్రెస్ పార్టీకి, వారి కుటుంబానికి లక్ష్మారెడ్డి మరణం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మారెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట స్థానిక సర్పంచ్ బొమ్మ వీరస్వామి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు జగదీష్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కోళ్ల రవి, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply