తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా ..
చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్టు
బంగారం, వెండి, నగదు స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఏలూరు ఎస్పీ
ఆంధ్రప్రభ, ఏలూరు : ఆ ఇద్దరి దొంగలకు తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యం. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకొని దొంగతనాలకు పాల్పడుతుంటారు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన ఈ ఇద్దరు ఇంటి తాళాలు పగుల కొట్టి బంగారం, వెండి, డబ్బులు విలువైన వస్తువులను దోచుకెళ్తుంటారు. సుమారు ఏడాది కాలంగా దొంగతనాలకు పాల్పడుతూ జల్సాలు చేస్తున్నారు. చివరికి పోలీసులకు చిక్కారు. వివరాల్లోకి వెళ్తే..

ముదినేపల్లి, కలిదిండి, మండవల్లి, బంటుమిల్లి, పెడన, మొగల్తూరు మరికొన్ని మండలాల్లో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేయడం ప్రారంభించారు. ఇంటి తాళాలు పగలు కొట్టి ఇంటిలోఉన్న బంగారం, వెండి, డబ్బులు, విలువైన వస్తువులు దొంగతనాలకు, నేరాలకు పాల్పడ్డారు. ఏలూరు జిల్లా సూపరింటెండెంట్ ప్రతాప్ శివ కిశోర్, ఆదేశాల మేరకు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో, కైకలూరు రూరల్ సీఐ. వి.రవి కుమార్ ఆధ్వర్యంలో ముదినేపల్లి పోలీస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని, స్థానిక సమాచారాన్ని విశ్లేషించి నిందితులను గుర్తించారు. సోమవారం ముదినేపల్లి వద్ద వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి చోరీ చేసిన బంగారం, వెండి ఆభరణాలను, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీరు ఏలూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి మూడు జిల్లాలలో నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. సుమారు 200 గ్రాములు, ( 25 కాసులు), వెండి వస్తువులు సుమారు 3 కేజీలు, టీవీలు మూడు, గ్యాస్ సిలిండర్స్ 3 మోటార్ సైకిల్ 3 రికవరీ చేయగా రికవరీ చేసిన సొత్తు విలువ 45 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు అధికారులు తెలిపారు.

ఈ కేసులు ఛేదనలో ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులు, సిబ్బంది వి.రవి కుమార్, సీఐ కైకలూరు రూరల్ సర్కిల్ వి.ఎస్.వి.భద్రరావు, ఎస్.ఐ. ముదినేపల్లి, వి.వెంకటేశ్వర రావు, ఎస్.ఐ. కలిదిండి, కానిస్టేబుల్ బి. నాగబాబు, పీ.నాగరాజు, పీ. పవన్ కుమార్, జీ.శివ కోటయ్య, పీ.వి. సత్యనారాయణ (డి.ఎస్.బి., సెల్ ట్రాక్, ఏలూరు)లను ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అభినందించారు.
