160 Crores | రిలీజ్ కి ముందే రికార్డ్..

160 Crores | రిలీజ్ కి ముందే రికార్డ్..

160 Crores | రిలీజ్‌కు ముందే వారణాసి మూవీ రికార్డ్
ఓవర్సీస్ రైట్స్‌కు 160 కోట్ల భారీ ఆఫర్
శ్రీరాముడిగా కనిపించనున్న మహేష్ బాబు
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో తెరకెక్కుతున్న భారీ చిత్రం
2027లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్

160 Crores | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ మహేష్‌ బాబు, దర్శకధీరుడు రాజమౌళి.. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న క్రేజీ పాన్ వరల్డ్ మూవీ వారణాసి. ఈ సినిమా (Movie) టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్ చేసినప్పటి నుంచి అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఈ క్రేజీ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినీ అభిమానులు అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ సినిమా రిలీజ్ కాకుండానే.. నయా రికార్డ్ సెట్ చేసిందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. వారణాసి సెట్ చేసిన నయా రికార్డ్ ఏంటి..?

160 Crores

160 Crores | 160 కోట్ల భారీ ఆఫర్..

ఈ క్రేజీ మూవీ థియేట్రికల్ రైట్స్ కోసం భారీ ఆఫర్స్ వస్తున్నాయట. ఈ సినిమా రిలీజ్ కి ఇంకా సంవత్సరం ఉండగా ఇప్పటి నుంచే క్రేజీ ఆఫర్స్ ఇస్తున్నాయట కొన్ని డిస్ట్రిబ్యూషన్ సంస్థలు. తాజాగా ఓ డిస్ట్రిబ్యూషన్ సంస్థ వారణాసి సినిమాకి ఓవర్ సీస్ రైట్స్ కు గాను 160 కోట్లు ఆఫర్ (Offer) ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియదు కానీ.. ఈ ఆఫర్ నిజమే అన్నట్టుగా జోరుగా వార్తలు రావడం ఆసక్తిగా మారింది. ఓవర్ సీస్ రైట్స్ కోసం ఇంత వరకు ఏ సినిమాకి ఇంత భారీ ఆఫర్ ఇవ్వలేదు. ఓవర్ సీస్ రైట్స్ రూపంలో ఇంత మొత్తం అందుకున్న తొలి భారతీయ సినిమాగా వారణాసి రికార్డ్ సృష్టించబోతుందని టాక్ వినిపిస్తోంది.

160 Crores

160 Crores | శ్రీరాముడు గా మహేష్ బాబు..

ఈ సినిమా విషయానికి వస్తే.. ఫాంటసీ టచ్ తో ఉండే మైథలాజికల్ జోనర్ మూవీగా రూపొందుతోంది. ఇందులో మహేష్ బాబు పాత్రలు చాలా డిఫరెంట్ గా ఉంటాయని.. ముఖ్యంగా మహేష్‌ బాబు (Mahesh Babu) శ్రీరాముడుగా కనిపించబోతున్నాడనే వార్త మరింతగా అంచనాలు పెంచేసింది. మహేష్ బాబు కెరీర్ లో ఇది భారీ ప్రాజెక్ట్. స్వయంగా మహేష్ బాబు ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని.. లైఫ్ లో ఒక్కసారి మాత్రమే వచ్చే ఛాన్స్ అని.. ఈ సినిమా గురించి ఎవరు ఎన్ని రకాలుగా ఊహించుకున్నా.. అంతకు మించి ఉంటుందని చెప్పడంతో మరింత బజ్ క్రియేట్ అయ్యింది.

160 Crores

160 Crores | ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో..

ఇందులో బాలీవుడ్ స్టార్ (Bollywood Star) హీరోయిన్ ప్రియాంక చోప్రా మందాకినిగా నటిస్తుంది. అలాగే మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ విలన్ కుంభ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రూపొందుతోన్న ఈ సినిమాని 2027లో ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. 120కి పైగా దేశాల్లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. మరి.. రిలీజ్ కి ముందే సరికొత్త రికార్డులు సృష్టిస్తుంటే.. ఇక రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.