ఉచిత మొబైల్‌ రిపేరింగ్‌ శిక్షణ ప్రారంభం

గుంటూరు, ఆంధ్రప్రభ: నాగార్జున విద్యాలయంలో సామాజిక బాధ్యత విభాగం ఆధ్వర్యంలో రూసా 2.0 నిధులతో నిర్వహించనున్న ఉచిత మొబైల్‌ రిపేరింగ్‌ ఐదు రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ పాల్గొని శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రెక్టార్‌ ఆచార్య ఆర్‌. శివరాం ప్రసాద్‌, పాలకమండలి సభ్యులు ఆచార్య త్రిమూర్తి, ఆచార్య పి. సుధాకర్‌, సామాజిక బాధ్యత విభాగం సంచాలకులు ఆచార్య బి. బాబిత, సీనియర్‌ కార్యక్రమ అధికారి డాక్టర్‌ ఎం. వెంకటరమణతో పాటు శిక్షణ పొందనున్న 120 మంది విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఐదు రోజుల పాటు జరిగే ఈ శిక్షణ ద్వారా విద్యార్థులకు మొబైల్‌ మరమ్మతులకు సంబంధించిన సాంకేతిక నైపుణ్యాలను అందించనున్నారు. ఈ నైపుణ్యాలు విద్యార్థులకు భవిష్యత్తులో స్వయం ఉపాధి, ఉపాధి అవకాశాలకు ఉపయోగపడేలా శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.