Vijayawada-Auto-Nagar : ఎవరొచ్చినా ..Andhra Prabha Exclusive Story
Vijayawada-Auto-Nagar : ఎవరొచ్చినా ..Andhra Prabha Exclusive Story
- ఆటోనగర్ ఇంతే
- రోజు లక్షల్లో టర్నోవర్ .
- వేల కుటుంబాలకు జీవనధార.
- ఎన్నికల్లోనే హడావిడి
- ఆ తర్వాత యమునా తీరే
- రాత్రి వేళ జూదం..మద్యం మత్తు
- డ్రగ్స్ కు సురక్షిత అడ్డా
- ఇదీ ఆసియా టాప్ ఆటోనగర్ స్థితి గతి
( విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ )

Vijayawada-Auto-Nagar : ఆసియాలోనే అతిపెద్ద ఆటోనగర్ గా పేరు పొందిన విజయవాడ జవహర్ ఆటోనగర్ దీర్ఘకాలిక సమస్యలు ఏ పాలకమండలి వచ్చిన తీర్చడం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు గెలిచినవారు ఆటోనగర్ అభివృద్ధి చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్న. ప్రతి రోజు లక్షలల్లో వ్యాపారం, వేల కుటుంబాలు ఆటో నగర్ లో వివిధ పనులు చేసుకుంటూ వేల మంది జీవనం గడుపుతున్నారు.

ప్రతి సారి ఆటోనగర్ ఎన్నికలలో వాగ్దానాలు ఇస్తున్నారే తప్ప సమస్యలు తీరడం లేదు. గెలిచినవారు సమస్యలపై పోరాటం చేసింది లేదన్న విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. ఆటోనగర్లో దీర్ఘ కాలంగా రహదారులు డ్రైనేజ్ చెత్త ట్రాఫిక్ సమస్య మంచినీటి సమస్య విద్యుత్ సమస్యలు ఉన్నాయి.

నిత్యం రద్దీగా ఉండే రోడ్ల పక్కనే లారీలు భారీ వాహనాలు పార్కింగ్ చేయడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడమే కాకుండా ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. దింతో పాటు రాత్రి సమయాల్లో అసంఘిక కార్యకలాపాలు ఇటీవలే కాలంలో పెరిగిపోతాయి.

మద్యం సేవించడం, డ్రగ్స్, పేకాట, వ్యభిచారం లాంటి అసంఘిక కలాపాలు నిర్వీగ్నంగా జరుతున్నాయి. అటు అధికారులు కాని పోలీసులు, పాలకవర్గం గానీ పట్టించుకోవడం ఆరోపిస్తున్నారు. ఆటోనగర్ ప్రధాన రహదారులు క్రాస్ రోడ్లు వద్ద చెత్త పేరుకుపోవడం రోడ్లు ఆక్రమించుకొని వ్యాపారులు వ్యాపారాలు చేస్తున్న పట్టించుకునే నాధుడే లేడు.
ఆటోనగర్ చుట్టూ గల ఆక్రమణలు జరుగుతున్నాయి. డ్రైనేజ్ అస్తవ్యస్తంగా ఉండడంతో చిన్న వర్షానికి రోడ్డుపై నీళ్లు చేరుతున్నాయి. నిత్యం కార్మికులతో రద్దీగా ఉండే ఆటోనగర్లో తగే నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు

గతంలో 2014లో త్రాగునీరు కోసం రెండు కోట్ల అంచనాలతో కట్టిన వాటర్ ట్యాంక్ నిరుప్రయోగంగా ఉంది దాన్ని పట్టించుకునే వారే లేరు. ఆటోనగర్ చుట్టూ సమస్యలు ఉన్న ఎన్నికల అప్పుడు ఆ సమస్యలు నాయకులు గుర్తుకు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో గెలిచినవారు ఆటోనగర్ అభివృద్ధికి కృషి చేయాలని, ఇక్కడ ప్రజల జీవనం సేఫగా సాగేలా చర్యలు తీసుకుని ప్రశాంత వాతావరణం కల్పించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
