Director Maruthi | ప్లాన్ మారిందా..?

Director Maruthi | ప్లాన్ మారిందా..?

Director Maruthi | వరుణ్ తేజ్ – వైష్ణవ్ తేజ్ నో చెప్పారా?
అఖిల్‌తో మారుతి కొత్త ప్రాజెక్ట్?
రాజాసాబ్ తర్వాత మారిన మారుతి ప్లాన్

Director Maruthi | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : డైరెక్టర్ మారుతి.. రాజాసాబ్ మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ అవ్వాలి అనుకున్నాడు. నెక్ట్స్ రాజాసాబ్ ని మించిన సినిమా చేయాలి అనుకున్నాడు. అయితే.. అనుకున్నది ఒక్కటి.. అయ్యింది ఒక్కటి.. దీంతో రాజాసాబ్ సినిమా గురించి మారుతి పై ఎప్పుడూ లేనంతగా విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. నెక్ట్స్ మూవీని మెగా హీరోతో చేయాలని ట్రై చేశాడు. దాదాపుగా ఫిక్స్ అంటూ ప్రచారం జరిగింది. అయితే.. మెగా హీరో మారుతికి షాక్ ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది. అందుకే.. మారుతి ప్లాన్ మారిందట. ఇంతకీ.. మారుతికి షాక్ ఇచ్చిన మెగా హీరో ఎవరు..? ఇప్పుడు మారుతి ప్లాన్ ఏంటి..?

Director Maruthi | ఆ ఇద్దరూ నో చెప్పారా..?

Director Maruthi

మారుతి నెక్ట్స్ మూవీ కోసం ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ రెడీ చేశాడట. ఆ కథను మెగా హీరో వరుణ్ తేజ్ తో చేయాలి అనుకున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారనేది ఇన్ సైడ్ న్యూస్. వరుణ్ – మారుతి కాంబో ఫిక్స్ అని వార్తలు వచ్చాయి. అయితే.. వరుణ్ తేజ్ బరి అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాని స్టార్ట్ చేశాడు. మారుతి కథ నచ్చలేదో.. లేక బిజీగా ఉండడం వలన నో చెప్పాడో తెలియదు కానీ.. ఈ ప్రాజెక్ట్ అయితే లేదని తెలిసింది. వరుణ్ తేజ్ తో కుదరకపోతే.. వైష్ణవ్ తేజ్ తో అయినా చేయాలి అనుకున్నాడు మారుతి. అయితే.. వైష్ణవ్ తేజ్ తో కూడా సెట్ కాలేదట.

Director Maruthi | అఖిల్ – మారుతి..

Director Maruthi

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. అక్కినేని అఖిల్ తో మారుతి సినిమా చేయాలి అనుకుంటున్నాడట. మారుతి.. ఇటీవల అఖిల్ కి కథ చెప్పాడని.. ఈ కథ నచ్చడంతో అఖిల్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమన్నాడు అని ప్రచారం జరుగుతుంది. అఖిల్ కెరీర్ ఆరంభంలోనే మారుతితో సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి కానీ.. సెట్ కాలేదు. మారుతి నాగచైతన్యతో శైలజా రెడ్డి అల్లుడు అనే సినిమా చేశాడు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకుంది. ఇప్పుడు చైతూ తమ్ముడు అఖిల్ తో సినిమా ప్లాన్ చేస్తుండడం ఆసక్తిగా మారింది. మరి.. అఖిల్ అయినా మారుతితో సినిమా చేయడానికి ఎస్ చెబుతాడేమో చూడాలి.

Director Maruthi

Leave a Reply