మొక్కజొన్న రైతులకు 125 కోట్ల రూపాయలు చెల్లింపు
మొక్కజొన్న రైతులకు 125 కోట్ల రూపాయలు చెల్లింపు
305 కోట్ల రూపాయల బకాయిలు
ఒక లక్ష 86 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు
జిల్లా మార్క్ఫెడ్ అధికారి తహమీన్
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లాలో ప్రభుత్వానికి విక్రయించిన మొక్కజొన్న పంటకు సంబంధించి రైతులకు ఇప్పటివరకు రూ.125 కోట్ల చెల్లింపులు చేసినట్లు జిల్లా మార్క్ఫెడ్ అధికారి తహమీన్ తెలిపారు.
జిల్లాలో 16 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 30,468 మంది రైతుల నుంచి 1.86 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేసినట్లు ఆమె వెల్లడించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని జిల్లాలోని 40 గోదాములతో పాటు నంద్యాల ప్రాంతంలోని గోదాములకు తరలించినట్లు తెలిపారు.
మొత్తంగా మొక్కజొన్న రైతులకు రూ.430 కోట్ల మేర చెల్లింపులు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.125 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఇంకా సుమారు రూ.300 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు.
గోదాముల్లో నిల్వల ధృవీకరణ, రికార్డుల ప్రకారం దశలవారీగా బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు. మిగిలిన చెల్లింపులు కూడా త్వరలోనే క్రమక్రమంగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయని చెప్పారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, మరో పది రోజుల్లో చెల్లింపుల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని తహమీన్ వివరించారు.
