డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీఐ బన్సీలాల్

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీఐ బన్సీలాల్

చెన్నూర్, ఆంధ్రప్రభ : డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే ప్రధాన లక్ష్యమని చెన్నూర్ టౌన్ సీఐ బన్సీలాల్ అన్నారు. శనివారం చెన్నూరు పట్టణంలోని కొత్త బస్టాండ్ పరిసర ప్రాంతాలు, పాన్ షాపులు, ఆటో స్టాండ్ తదితర ప్రదేశాలలో డాగ్ స్క్వాడ్‌తో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ… యువత భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలకు ఎవరైనా పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. ఈ తనిఖీల్లో చెన్నూర్ టౌన్ ఎస్సై రాజశేఖర్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply