ఉచిత వైద్య శిబిరాలతో ప్రజలకు మేలు

ఉచిత వైద్య శిబిరాలతో ప్రజలకు మేలు
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఉచిత వైద్య శిబిరాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని మాజీ సర్పంచ్ బోధపాటి గోవిందప్ప తెలిపారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశాల మేరకు మండలంలోని లత్తవరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో అనంతపురం లోని మాగ్నస్ హాస్పిటల్ వైద్య బృందం చేత మంగళవారం మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రీషి, డాక్టర్ లిఖితలు దాదాపు 200 మందికి వైద్య పరీక్షలు చేసి, వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బోధపాటి గోవిందప్ప మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాల వలన ప్రజలకు ఎంతో మేలు జరగడంతో పాటు, ఆరోగ్యంపై అవగాహన పెంచుకోనేందుకు దోహద పడతాయన్నారు.
