అంబేద్కర్ సర్కిల్ దగ్గర చలివేంద్రం ఏర్పాటు చేయాలి

అంబేద్కర్ సర్కిల్ దగ్గర చలివేంద్రం ఏర్పాటు చేయాలి

సామాజిక కార్యకర్త మంగళపల్లి నాగరాజు

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : పట్టణంలోఅంబేద్కర్ సర్కిల్ దగ్గర చలివేంద్ర ఏర్పాటు చేయాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ వక్కల శ్యాంసుందర్ కు సామాజిక కార్యకర్త మంగళపల్లి నాగరాజు. వినతి పత్రం అందజేశారు అనంతరం మాట్లాడుతూ ఉపాధి రీత్యా, ప్రయాణాల కోసం అధిక సంఖ్యలో ప్రజలు అక్కడ బస్సుల కోసం వాహనాల కోసం వేచి చూస్తారని, ఈ సర్కిల్ దగ్గర మహబూబాబాద్, ఖమ్మం వైపు వెళ్లే ప్రధాన రహదారుల కూడలి కావున ఇక్కడ ప్రయాణికులు ఎక్కువగా ఉంటారని ఈ వేసవి కాలంలో ఎండల తీవ్రత ఎక్కువుగా ఉన్నందున సామాన్య ప్రయాణికుల దాహం తీర్చడానికి తొర్రూరు పురపాలక సంఘము ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయాలని కమిషనర్ కు వినతిపత్రం ఇవ్వగా త్వరలో చేస్తామని కమిషనర్ సానుకూలంగా స్పందించారనిసామాజిక కార్యకర్త మంగళపల్లి నాగరాజు చెప్పారు.

Leave a Reply