గోదావరి పుష్కరాలకు రహదారి, బ్రిడ్జి అభివృద్ధి చేయాలి..

లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని చామన్‌పల్లి ఎక్స్‌ రోడ్డు నుంచి మునిపల్లి గోదావరి వరకు రహదారిని అభివృద్ధి చేసి డబుల్‌ రోడ్డుగా నిర్మించడంతో పాటు మునిపల్లి వద్ద కొత్త బ్రిడ్జి మంజూరు చేయాలని కోరుతూ మునిపల్లి సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, గ్రామస్తులు నిర్మల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కుచాడి శ్రీహరిరావుకు వినతిపత్రం అందజేశారు.

గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని వారు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం చామన్‌పల్లి ఎక్స్‌ రోడ్డు నుంచి మునిపల్లి గోదావరి వరకు ఉన్న ప్రధాన రహదారిని అభివృద్ధి చేసి డబుల్‌ రోడ్డుగా నిర్మించాలని కోరారు. అలాగే మునిపల్లి వద్ద ఉన్న పాత బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణానికి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

రోడ్డు విస్తరణ, కొత్త బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన అంచనాలను సిద్ధం చేయించి, అవసరమైన నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేయాలని కోరారు. వినతిపత్రాన్ని స్వీకరించిన కుచాడి శ్రీహరిరావు సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో లక్ష్మణచాంద మండలాధ్యక్షుడు కొండ్రు నరేష్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ ఈటల శ్రీనివాస్‌, నల్లాల లింగారెడ్డి, పోన్కల్‌ గంగారెడ్డి, పోన్కల్‌ లింగన్న, మునిపల్లి లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మునిపల్లి సర్పంచ్‌, ఉపసర్పంచ్‌లు, గ్రామస్తులు పాల్గొన్నారు.