రిటైర్డ్ పంచాయతీ కార్యదర్శి సత్తయ్యకు ఘన సన్మానం
రిటైర్డ్ పంచాయతీ కార్యదర్శి సత్తయ్యకు ఘన సన్మానం
దండేపల్లి, ఆంధ్రప్రభ:
దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన పోతు సత్తయ్యను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. సోమవారం జన్నారంలోని ఆయన స్వగృహానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు సత్తయ్యను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సత్తయ్య తన ఉద్యోగ బాధ్యతలను క్రమశిక్షణతో, నిజాయితీతో నిర్వహించి ప్రజల మన్ననలు పొందారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కంది సతీష్ కుమార్, తాళ్లపేట మాజీ సర్పంచ్ అడై కాంతారావు, మంచిర్యాల జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మహ్మద్ సలావుద్దీన్, నాయకులు మాదవి శ్రీనివాస్, మూతే లచ్చన్న తదితరులు పాల్గొన్నారు.
