ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభం

ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభం

ములకలపల్లి, ఆంధ్రప్రభ : ములకలపల్లి మండలంలోని చాపరాలపల్లి గ్రామంలో ఆదివారం నాడు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఈ ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు నిర్వాహకులు షేక్ ఉద్దండు సాహెబ్ వారి సౌజన్యంతో మండలంలోని ప్రజలకు సమగ్ర వైద్య సేవలు అందించేందుకు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా చాపరాలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే వైద్యులు అందిస్తున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకుని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులకు సూచించారు. శిబిరానికి వచ్చిన ప్రజలకు వివిధ వైద్య విభాగాలకు చెందిన నిపుణులచే ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు.

క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో మెడికల్ క్యాంపు నిర్వాహకులు షేక్ ఉద్దండు సాహెబ్ ఉచిత వైద్య శిబిరాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారని, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సమగ్ర వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ శిబిరాలను ప్రజలు పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ప్రజలకు ఈ వైద్య శిబిరాలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించి ఎక్కువ మంది ప్రజలు శిబిరాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ముఖ్యంగా రక్తపరీక్షలు, కీళ్ల సమస్యలకు సంబంధించిన పరీక్షలు, గుండె సంబంధిత పరీక్షలు వంటి ఆరోగ్య పరీక్షలను ప్రజలు చేయించుకొని తమ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని సూచించారు. పలు రకాల డాక్టర్లు అందుబాటులో ఉన్నందున అవసరమైన వారికి అక్కడ పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు, అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply