Raviteja Movie | భర్త మహాశయులకు విజ్ఞప్తి ఫుల్ ఫన్ రైడ్ లా వుంటుంది – రవితేజ

Raviteja Movie | భర్త మహాశయులకు విజ్ఞప్తి ఫుల్ ఫన్ రైడ్ లా వుంటుంది – రవితేజ

Raviteja Movie | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మాస్ మహారాజా రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌ పై నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమా జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Raviteja Movie | వాళ్లతో చాలా ఎంజాయ్ చేశాను..

ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ… మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, నేను కలిసి 13 సినిమాలు చేశాం. మా సినిమాలన్నీ దాదాపు హిట్ అయ్యాయి. ఈ సినిమాలో మా హీరోస్ చాలా అందంగా కనిపిస్తారు. నన్ను కూడా చాలా అందంగా చూపించాడు డీవోపీ ప్రసాద్ (DOP Prasad) మూరెళ్ళ. తనతో తొమ్మిది సినిమాలు చేశాను. కొరియోగ్రాఫర్స్ శేఖర్, భాను కంపోజ్ చేసిన పాటలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఫైట్ మాస్టర్ పృద్వి ఇందులో ఎంటర్తినింగ్ గా ఉండే ఫైట్లు కంపోజ్ చేశారు. ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఎక్కువ మాట్లాడరు. ఆస్ట్రేలియన్ క్రికెటర్ లాగా కనిపిస్తారు. సినిమాని చాలా పాషన్ తో చేశారు. ఇందులో సునీల్ తో మళ్ళీ దుబాయ్ శీను లాంటి ఫన్ చూడబోతున్నారు. సత్య కిషోర్ మురళీధర్ గారు గెటప్ శీను సోని అందరు కూడా అద్భుతంగా చేశారు. వీళ్ళతో కలిసి చాలా ఎంజాయ్ చేశాను.

Raviteja Movie

Raviteja Movie | మా డైరెక్టర్ ఇరగదీసాడు..

అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, బాబి, కిషోర్.. వీరి డైరెక్షన్లో నేను విపరీతంగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తాను. నెక్స్ట్ శివ నిర్వాణతో చేస్తున్నాను. ఆ సినిమా గురించి తర్వాత మాట్లాడదాం. భీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. సక్సెస్ మీట్ లో తన గురించి మాట్లాడుతాను. మ్యూజిక్ ఇరగదీసాడు. హీరోయిన్స్ చాలా బ్రహ్మాండంగా నటించారు. మీరు అందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. మా డైరెక్టర్ కిషోర్ తిరుమ ప్రమోషన్స్ లో (Promotions) డాన్స్ ఇరగదీసారు. ఈ సినిమాకి టైటిల్ మా పవన్ ఇచ్చాడు. డైరెక్టర్ కిషోర్ ఈ సినిమాతో చాలా అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ చేశారు. ఈ సినిమా ఫుల్ ఫన్ గా ఉంటుంది. జనవరి 13న భర్త మహాశయులకు విజ్ఞప్తి థియేటర్స్ లో కలుద్దాం అన్నారు.

Raviteja Movie

Raviteja Movie | పవన్ కళ్యాణ్ గారి తర్వాత రవితేజ..

డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి నాకు ఇష్టమైన ప్రొడ్యూసర్. చాలా సెన్సిబుల్ ప్రొడ్యూసర్. ఆయన బ్యానర్ లో నా సినిమా ఖచ్చితంగా ఉంటుంది ఆయనతో పని చేయాలని కోరుకుంటున్నాను. మిరపకాయ వచ్చినా.. మిస్టర్ బచ్చన్ వచ్చినా.. ఒకేలా ఉండే వ్యక్తి మాస్ మహారాజా రవితేజ. స్థితప్రజ్ఞత కలిగిన వ్యక్తి. ఆ క్వాలిటీ పవన్ కళ్యాణ్ గారిలో తర్వాత రవితేజ గారిలో చూశాను. ఆయన డైరెక్టర్స్ గా పరిచయం చేసిన వాళ్ళందరూ ఈరోజు స్టార్ డైరెక్టర్ గా ఉన్నారు. నాకు డైరెక్టర్ జన్మ పునర్జన్మ ఇచ్చింది ఆయనే. మళ్ళీ రవితేజ గారితో బ్లాక్ బస్టర్ తీస్తాను. అది నా ప్రామిస్. ఈ సినిమాలో అందరూ నాకు నచ్చిన ఆర్టిస్టులు ఉన్నారు. ఈ సినిమా కంటెంట్ చాలా అద్భుతంగా ఉంది. ట్రైలర్ (Trailer) చూసిన వెంటనే బ్లాక్ బస్టర్ ఫీలింగ్ వచ్చింది. ఖచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్. సినిమా కిషోర్ తిరుమల సెన్సిబుల్ డైరెక్టర్. తప్పకుండా ఈ సినిమా తనకి బ్లాక్ బస్టర్ అవుతుంది. చాలా సంవత్సరాల క్రితం జనవరి 11న మిరపకాయ రిలీజ్ అయ్యే బ్లాక్ బస్టర్ అయింది. మళ్ళీ జనవరి 13న ఈ సినిమా వస్తుంది. ఖచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది. సంక్రాంతికి చాలా గట్టిగా కొడుతున్నాం అన్నారు.

Raviteja Movie

Raviteja Movie | అది.. రవితేజ గారు పెట్టిన భిక్ష..

డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ… మాలాంటి ఎంతో మంది డైరెక్టర్స్ అయ్యారంటే రవితేజ గారు పెట్టిన భిక్ష. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న మమ్మల్ని డైరెక్టర్లు చేశారు. త్వరలోనే ఆయనతో సినిమా చేస్తాను. రవితేజ గారు ఎన్నో డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉన్న సినిమాలు చేశారు. పవర్ సినిమా (Movie) టైంలో డైరెక్టర్ కిషోర్ డైలాగ్స్ విషయంలో నాకు చాలా హెల్ప్ చేశారు. కచ్చితంగా తన నిజాయితీ తన హార్డ్ వర్క్ ఈ సినిమాకి పే చేస్తుంది. ఈ సినిమాల్లో పని చేసిన అందరికీ అభినందనలు. ప్రసాద్ మూరెళ్ల రవితేజ గారిని చాలా అందంగా చూపించారు. బీమ్స్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చాడు. ఈ సినిమా చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉందని ఓ పర్సన్ చెప్పారు. ఆయనే చెబితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.

Raviteja Movie

Raviteja Movie | బొమ్మ బ్లాక్ బస్టర్..

డింపుల్ హయతి మాట్లాడుతూ.. డైరెక్టర్ హరీష్ శంకర్ గారిని ఇక్కడ చూడడం చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ సినిమాలో నేను చేసిన బాలమణి క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చాలా కొత్తదనం ఆడియన్స్ ఫీల్ అవుతారు. మా నిర్మాత సుధాకర్ గారు సినిమాని అద్భుతంగా నిర్మించారు. ఈ సినిమాలోని పాటలన్నీ చాలా బాగా హిట్ అయ్యాయి. రవితేజ గారితో ఇది నాకు రెండో సినిమా. ఆయనతో నటించడం చాలా ఆనందాన్నిచ్చింది డైరెక్టర్ (Director) గారు సినిమాని అద్భుతంగా తీశారు. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది అన్నారు.

Raviteja Movie | చాలా సర్ప్రైజ్ అయ్యాను..

హీరోయిన్ ఆశిక రంగనాథ్ మాట్లాడుతూ.. ఇది అద్భుతమైన జర్నీ. మా నిర్మాత సుధాకర్ గారికి థాంక్యూ. ఈ సినిమాని చాలా అద్భుతంగా నిర్మించారు. రవితేజ (Raviteja) గారితో పని చేయడం చాలా హ్యాపీగా ఉంది. విక్రమార్కుడులో ఆయన రెండు క్యారెక్టర్స్ ని ప్లే చేసిన విధానం చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను. అలాంటి సూపర్ స్టార్ తో నేను నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఇది చాలా వండర్ఫుల్ జర్నీ. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు అన్నారు.

Raviteja Movie | అందరికీ నచ్చుతుంది..

డైరెక్టర్ కిషోర్ తిరుమల (Kishore Tirumala) మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాను. ఈ సినిమాలో పని చేస్తున్న ప్రతి యాక్టర్ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది. జనవరి 13న తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. అందరూ సినిమాని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

CLICK HERE TO READ RGV | సెన్సార్ బోర్డ్ కు కాలం చెల్లిందా..?

CLICK HERE TO READ MORE