Modi Record | నెహ్రూ రికార్డ‌ను అధిగ‌మించ‌డంపై ప్ర‌శంస‌లు

Modi Record | నెహ్రూ రికార్డ‌ను అధిగ‌మించ‌డంపై ప్ర‌శంస‌లు

మోదీకి రాష్ర్ట‌పతి అభినంద‌న‌లు

Modi Record | న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఎన్నికైన ప్రధానమంత్రిగా అత్యధిక కాలం నిరంతరాయంగా కొనసాగిన నేతగా ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన రికార్డు సృష్టించారు. ఈ మైలురాయి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. 2026 జూన్‌ 10 నాటికి ప్రధాని మోదీ ఎన్నికైన ప్రధానిగా 4,399 రోజులు పూర్తి చేశారు. ఈ క్రమంలో దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఎన్నికైన ప్రధానిగా కొనసాగిన 4,398 రోజుల రికార్డును మోదీ అధిగమించారు. ఈ ఘనత దేశ ప్రజల్లో ఆయన నాయకత్వంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని ముర్ము పేర్కొన్నారు.

మోదీ నాయకత్వంలో పాలన, ఆర్థిక వ్యవస్థ, సామాజిక రంగాల్లో దేశం పురోగతి సాధించిందని రాష్ట్రపతి ముర్ము ప్రశంసించారు. దేశ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, అంతర్జాతీయ వేదికలపై భారత ప్రాధాన్యత పెరగడం మోదీ ఘ‌న‌త అని అన్నారు. మోదీ సాధించిన ఈ చారిత్రక మైలురాయిపై పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ నేతలు, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు. వరుసగా మూడు పర్యాయాలు ప్రధానిగా కొనసాగుతున్న మోదీ, ఇప్పుడు ఎన్నికైన ప్రధానిగా అత్యధిక కాలం పదవిలో ఉన్న నాయకుడిగా చరిత్రలో నిలిచారు.

Leave a Reply