రాష్ట్ర ఆర్య వైశ్య సంఘం కార్యవర్గ సభ్యునిగా రాజేశ్వర్ రావు

హసన్‌పర్తి, ఆంధ్రప్రభ : ఆర్య వైశ్య సంఘం కార్యవర్గ సభ్యునిగా హనుమకొండ జిల్లా హసన్‌పర్తికి చెందిన చకిలం రాజేశ్వర్ రావు నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.

1983లో మండల ఆర్య వైశ్య సంఘం వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా తన సేవా ప్రయాణాన్ని ప్రారంభించిన రాజేశ్వర్ రావు, అనంతరం మండల అధ్యక్షునిగా, జిల్లా కార్యదర్శిగా, ఉపాధ్యక్షునిగా అనేక సంవత్సరాలు సేవలందించారు. అలాగే నాలుగు సార్లు రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా నియమితులై, రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ పత్రికా కమిటీ సభ్యునిగా, వాణిజ్య సెల్ ఉపాధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు.

దీర్ఘకాల సేవలకు గుర్తింపుగా హసన్‌పర్తి నుంచి తొలిసారిగా ఆయనకు ప్రధాన కమిటీలో అవకాశం లభించడంపై మండల వ్యాప్తంగా ఆర్య వైశ్యులు హర్షం వ్యక్తం చేశారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ చకిలం రాజేశ్వర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply