ప|| శ్రీ రాజరాజేశ్వరికీ కళ్యాణికీ
పంచ ప్రణవ రూపిణీకి సదాశివునకు
శ్రీ రాజరాజేశ్వరికీ నీరాజనం
అను|| రక్తగంధ కస్తూరి విలేపనీ
సౌభాగ్య ప్రదాయినికీ భువనేశ్వరికీ
శితి కంఠునకు రాజేశ్వరికీ నీరాజనం.
చ|| యోగీశ్వర మనోధ్యేకు కింకరీ భూత
గీర్వాణీకి మంత్రిణి మంత్ర రూపిణీకీ
క్షేమకారిణీ జగత్కారిణీ కీ, శూల పాణికి నీరాజనం
చ|| పురాణాగము రూపిణీకా పరశుహస్త
శ్రీ రాజరాజేశ్వరికీ పీతాంబర ధారిణీకి
జగద్గురునకు శ్రీ రాజరాజేశ్వరీకీ నీరాజనం