క్విట్‌ ఇండియా దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ

మహబూబ్‌నగర్‌ రూరల్, ఆంధ్రప్రభ: క్విట్‌ ఇండియా దినోత్సవం సందర్భంగా మహబూబ్‌నగర్‌ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని డీసీసీ అధ్యక్షుడు ఏ. సంజీవ్‌ ముదిరాజ్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంజీవ్‌ ముదిరాజ్‌ కాంగ్రెస్‌ నాయకులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా సంజీవ్‌ ముదిరాజ్‌ మాట్లాడుతూ 1942 ఆగస్టు 9న మహాత్మాగాంధీ ఇచ్చిన ‘చేయో.. లేక చావో’ పిలుపుతో ప్రారంభమైన క్విట్‌ ఇండియా ఉద్యమం భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక మలుపుగా నిలిచిందన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను ప్రతి భారతీయుడు స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షిస్తూ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ మైనారిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కోత్వాల్‌, యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివంత్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్‌ అక్తర్‌, గ్రంథాలయ చైర్మన్‌ మల్లు నర్సింహారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.